స్థానిక పత్రికలకు ప్రకటనలు పెంచాలని విజ్ఞప్తి
VSP: వరాహ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం, చందనోత్సవం నేపథ్యంలో స్థానిక పత్రికలకు ప్రకటనలు విడుదల చేయాలని లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ప్రతినిధులు దేవస్థానం ఈవో జె. వెంకటరావును కోరారు. గతంలో రూ.5 వేలుగా ఉన్న ప్రకటనలను గతేడాది రూ.2,500లకు తగ్గించారని గుర్తుచేసి, మళ్లీ పాత విధానమే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈవో సానుకూలంగా స్పందించారు.