బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న కూసుమంచి మండలంలో పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మతండాకు చెందిన జర్పుల సింధుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 1.75 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్వయంగా అందజేశారు. అలాగే మంగళితండాలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.