పాపం.. గొడవను ఆపడానికి వెళ్తే చంపేశారు

పాపం.. గొడవను ఆపడానికి వెళ్తే చంపేశారు

BDK: భద్రాచలం(M) చర్ల రోడ్డు సమీపంలో మద్యం మత్తులో ఉన్న కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న కొందరు దుండగులు తమలో తాము ఘర్షణ పడుతుండగా, రవి అనే వృద్ధుడు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దుండగులు ఆయనపై దాడి చేసి, కడుపులో కత్తితో పొడిచారు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.