'గ్రామీణ రోడ్లు , బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు'
VZM: జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి 84.62 కోట్లు మంజూరయ్యానట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని, ఈ మేరకు బొబ్బిలి-8,చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు.