వైద్య విద్యార్థినికి చేయూత

వైద్య విద్యార్థినికి చేయూత

మహబూబ్‌నగర్: నియోజకవర్గం మాచన్ పల్లి తండాకు చెందిన రాజేశ్వరికి వైద్య విద్యలో కన్వీనర్ కోటా కింద సీటు లభించింది. కానీ కట్టేందుకు సరిపడ డబ్బు లేకపోవడంతో దాతల సహకారం కోరింది. దీంతో స్పందించిన పారిశ్రామికవేత్త సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి మంగళవారం రూ. 1.35 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ మొత్తాన్ని నేరుగా విద్యార్థిని ఖాతాలోకి బదిలీ చేశారు.