రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా తెనాలిలోని నాలుగు వరుసల రోడ్డులో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందారు. అయితే నాగమల్లేశ్వరరావు పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.