బాన్సువాడ దుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

బాన్సువాడ దుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

KMR: బాన్సువాడ కోట గల్లీలోని దుర్గాదేవి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రాల నడుమ విశేష అలంకరణ, కుంకుమార్చనలు జరిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా, మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.