ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న భూ బాధితులు

యాదాద్రి: గౌరెల్లి నుండి భద్రాచలం రోడ్డు కోసం సేకరిస్తున్న భూమికి బహిరంగ మార్కెట్ ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించాలంటూ భూ బాధితులు డిమాండ్ చేశారు. గురువారం పోచంపల్లి మండల పరిషత్తు సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని రైతులు కలిసి తమ గోడును వెలిబుచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.