రేపు నెల్లూరులో జాబ్ మేళా
నెల్లూరు ప్రభుత్వ DKW కాలేజీలో ఏపీఎస్ఎస్జీసీ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా శనివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డాక్టర్ డి.గిరి ఓ ప్రకటన విడుదల చేశారు. 2023, 24, 25లో డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.