కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి: రామయ్య

KDP: కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించి ప్రజల ఆశీస్సులను పొందారన్నారు.