స్కూటీతో ఢీకొట్టిన బాలిక.. మూడేళ్ల బాలుడు మృతి
MDCL: నగరంలో విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి ఈసీ నగర్లో స్కూటీపై వెళ్తోన్న 14 ఏళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని స్కూటీతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు అయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.