VIDEO: నగరంలో ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో తనిఖీలు
ఏలూరు వైఎస్ఆర్ కాలనీ, పోనంగి పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆ ప్రాంతాలను చుట్టుముట్టి ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 14 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.