జమ్మూకాశ్మీర్‌లో విస్తృత తనిఖీలు
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు రోజుల్లో 800కు పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేసి 500 మందికిపైగా ప్రజలను విచారించారు. ఈ సోదాల్లో భాగంగా పుల్వామాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.