VIDEO: డ్రైనేజీ నీటితో కాలనీవాసులు అవస్థలు

VIDEO: డ్రైనేజీ నీటితో కాలనీవాసులు అవస్థలు

CTR: డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి వస్తుండడంతో మేలుపట్ల మహమ్మద్ నగర్ కాలనీవాసులు అవస్థలు పడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షుడు అయూబ్ బాషా తెలిపారు. కాలువలు చిన్నవి కావడంతో వర్షాల సమయంలో నిండి మురుగు రోడ్లపైన ప్రవహిస్తోందన్నారు. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు చెప్పారు. అధికారులు స్పందించి రోడ్లపైకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.