పరీక్షా విధుల్లో ఎస్సై కమలాకర్

పరీక్షా విధుల్లో ఎస్సై కమలాకర్

ప్రకాశం: ముండ్లమూరు జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా పోలీసు శాఖ తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగేందుకు స్థానిక SI కమలాకర్ సిబ్బందితో కలిసి పరీక్షా కేంద్రం వద్ద పర్యవేక్షణ నిర్వహించారు. పరీక్షలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు నిబంధనలు పాటించాలని సూచించారు.