కేజీబీవి పాఠశాల సందర్శించిన కలెక్టర్

కేజీబీవి పాఠశాల సందర్శించిన కలెక్టర్

NRPT: దామరగిద్ద కేజీబీవి పాఠశాలను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. తరగతి గదులు, వంట గది పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని చెప్పారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.