'మే 20న సమ్మెను జయప్రదం చేయండి'

GNTR: కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మే 20వ తేదీ జరిగే అఖిల భారత సమ్మెలో కార్మిక వర్గం భాగస్వామ్యం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై. నేతాజీ పిలుపునిచ్చారు. ఫిరంగిపురం మండలం నుదురుపాడు పీహెచ్సీ వద్ద జరిగిన ఆశా వర్కర్స్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల ఒప్పంద జీవోలు ఇవ్వాలన్నారు.