VIDEO: ప్రపంచ పోటీలకు నాగజ్యోతి ఎంపిక
AKP: రోలుగుంటకు చెందిన పవర్ లిఫ్టర్ పీ.వీ.ఎం. నాగజ్యోతి ప్రపంచ పోటీలకు ఎంపికయ్యింది. హర్యానాలో ఆదివారం జరిగిన ఎంపిక పరీక్షల్లో ప్రతిభ చాటిన ఆమె అక్టోబర్ 19 నుంచి 25 వరకు పోలాండ్లో జరిగే ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఆమెకు విజయం చేకూరాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగజ్యోతి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.