దక్షిణ మధ్య రైల్వే జోన్ RECORD

HYD: దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ మరో మైలురాయిని సాధించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న రైల్వే లైన్లకు 100% విద్యుదీకరణ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 కిలోమీటర్ల రైలు మార్గాలు ఉండగా ఈ రైల్వే మార్గం మొత్తం విద్యుదీకరణ పూర్తయినట్లు ప్రకటించింది. విద్యుదీకరణ పూర్తయినప్పటికీ 395 డీజిల్ ఇంజిన్లు వాడుతున్నారు.