పాలేరు నియోజకవర్గ ప్రజలకు మంత్రి శుభవార్త

పాలేరు నియోజకవర్గ ప్రజలకు మంత్రి శుభవార్త

KMM: పాలేరు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఎవరైనా చనిపోయిన, వివాహం జరిగే కుటుంబాలకు ప్రతి ఒక్కరికి తన వంతుగా రూ. 10 వేలు అందజేస్తానని ప్రకటించారు. ఈనెల నుంచే ఈ సాయం అందజేస్తానని చెప్పారు. పొంగులేటి నిర్ణయం పై పాలేరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.