గద్వాలలో 540 మందికి చెక్కుల పంపిణీ
GDL: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపికైన 540 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బి.ఎస్. జయలక్ష్మితో కలిసి చెక్కులను అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.