సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

కృష్ణా: రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్ సీఐ కొమకూర్ శివాజీ ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ లలో కొంతమంది సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్‌కు పాల్పడుతూ మోసాలు చేస్తున్నారని వివరించారు. అమ్మాయిల ఫోటోలతో వలవేసి డబ్బులు కాజేస్తున్నారన్నారు.