బెంగాల్‌ సర్కారుపై అమిత్ షా 'ఛార్జ్‌షీట్‌'

బెంగాల్‌ సర్కారుపై అమిత్ షా 'ఛార్జ్‌షీట్‌'

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేంద్రమంత్రి అమిత్‌ షా 'ఛార్జ్‌షీట్‌' విడుదల చేశారు. కేవలం ఈ రాష్ట్రం నుంచే భారత్‌లోకి చొరబాటుదారులు ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు ఆందోళనకరంగా మారిందన్నారు. 15 ఏళ్లుగా బెంగాల్‌లో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు.