VIDEO: కాండ్రకోటలో వడగళ్ల వర్షం

VIDEO: కాండ్రకోటలో వడగళ్ల వర్షం

KKD: పెద్దాపురం మండలం కాండ్రకోటలో ఆదివారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నా, సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో కాండ్రకోట నూకాలమ్మ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన ఈ వర్షం ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.