అవార్డు సాధించిన తిరుపతికి సీఎం అభినందన

అవార్డు సాధించిన తిరుపతికి సీఎం అభినందన

TPT: స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గెలుచుకున్న తిరుపతి నగరపాలక సంస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. నగర పాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. శుభ్రతపై విశేషంగా దృష్టి సారించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన తిరుపతి సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.