ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును పరిశీలించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని 41వ డివిజన్‌లోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్‌లను నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ ప్రాంతాలను 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నుడా చైర్మన్ ఆదేశించారు.