రేణు దేశాయ్‌పై ట్రోల్స్‌.. ఆరుగురు అరెస్ట్‌

రేణు దేశాయ్‌పై ట్రోల్స్‌.. ఆరుగురు అరెస్ట్‌

సినీనటి రేణు దేశాయ్‌పై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా, ఇటీవల వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడారు. వందలో 10 పిచ్చి కుక్కలు ఉంటే.. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.