రామాలయంలో ప్రత్యేక పూజలు

రామాలయంలో ప్రత్యేక పూజలు

కడప: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ బద్రావతి బావ నారాయణ, శ్రీ సీతారాముల ఆలయంలో శనివారం స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా..ఆలయ అర్చకుడు జింకా సాంబయ్య స్వామివారి మూల విరాట్‌కు పలు అభిషేకాలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.