అక్కడ పర్యటిస్తే పదవి పోతుందన్నారు: మోదీ

అక్కడ పర్యటిస్తే పదవి పోతుందన్నారు: మోదీ

యూపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాది పార్టీ తన మూఢనమ్మకాలు, పిరికితనంతో నోయిడాను గాలికొదిలేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు నోయిడాలో పర్యటిస్తే అది వారికి అపశకునంగా మారుతుందనే ప్రచారాన్ని ఆ పార్టీ ఎంతోకాలంగా నమ్ముతుందంటూ ఎద్దేవా చేశారు. అందుకు తనను కూడా నోయిడాలో పర్యటించవద్దని ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సూచించారని గుర్తుచేశారు.