లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోండి: ఎస్సై దివ్య
BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని SI శాకాపురం దివ్య ఇవాళ సూచించారు. ఈనెల 15న భూపాలపల్లి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. త్వరగా న్యాయం అందుతుందని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.