ఆంజనేయస్వామి సన్నిధిలో మాజీమంత్రి

SKLM: జలుమూరు మండలం లింగం నాయుడుపేట గ్రామంలో నూతనంగా శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాలలో రామాలయాలతో పాటు ఆంజనేయస్వామి ఆలయాలు కూడా ఏర్పాటు చేయడం శుభసూచకమని పేర్కొన్నారు.