ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: మండల కేంద్రమైన అమృతలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో (పీఎంశ్రీ) కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బుధవారం ప్రారంభించారు. పీఎంశ్రీ నిధులతో రూ.15.58 లక్షల ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, హెచ్ఎం కనపర్తి నిరీక్షణ పాల్గొన్నారు.