ఏకగ్రీవంగా ఎన్నికైన హనుమాన్ తాండ సర్పంచ్
NGKL: తిమ్మాజీపేట మండలం హనుమన్ తండా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాట్రవత్ దేవిని సర్పంచ్‌గా గ్రామవాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆమెను అభినందించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిగా సహకారం అందిస్తామని తెలిపారు.