వేములవాడలో ఘనంగా రథోత్సవం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి మహన్యాసం నిర్వహించారు. పరిహార దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ ముందు నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రథయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.