విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు పట్టణంలో 33/11KV విద్యుత్ ఉప కేంద్ర పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు చేయనున్నారు. ఇవాళ ఉదయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ ఏఈ శేషు కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రజలు, రైతులు, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.