31 నుండి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

31 నుండి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

TPT: గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈనెల 31వ తేదీ నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలను ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్టేడియం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.