బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ అందజేత

NZB: ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మాక్లూర్ మండలం సింగంపల్లి తండాకు చెందిన మలావత్ దేశాయ్ కుటుంబానికి మంజూరైన రూ.60 వేల సీఎం సహాయనిధి చెక్కును మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ ఆర్థిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రికి, సహాయం చేసిన నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.