వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్

ప్రకాశం: ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. శుక్రవారం వేసవిలో తాగునీటి సరఫరా వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త, చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.