లైవ్ వీడియో: సునామీలా విరుచుకుపడ్డ వరద
TPT: కేవీబీ పురం మండలం ఓళ్లూరు వద్ద రాయలచెరువు తెగిపోవడంతో ఐదు గ్రామాలు తీవ్ర నష్టాన్ని గురైన విషయం తెలిసిందే. అయితే చెరువు నీరు ఉధృతంగా గ్రామాల్లోకి ప్రవహించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనను కొందరు గ్రామస్తులు లైవ్ వీడియోగా చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.