గణపురం శరత్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే
SRPT: నాగారం మండలం వర్ధమానుకోటలో గణపురం మల్లయ్య మనవడు గణపురం శరత్ అనారోగ్యంతో అకాల మరణం చెందగా వారి చిత్ర పటానికి గురువారం ఎమ్మెల్యే సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు తొడుసు లింగయ్య, ఆకుల బుచ్చిబాబు, ముకుందా రెడ్డి పాల్గొన్నారు.