జి.మాడుగులలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ASR: జి.మాడుగుల మండలం అనర్భ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిగరువు నుంచి వస్తున్న జీపు, పాడేరు వైపు వెళ్తున్న బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న కిల్లంకోటకు చెందిన ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108లో క్షతగాత్రులను జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు.