ప్రభాస్‌కు లెటర్ రాసిన రాజమౌళి
జపాన్‌లో 'బాహుబలి: ది ఎపిక్' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు దర్శకుడు రాజమౌళి లెటర్ రాశాడు. 'జపాన్‌లో అభిమానులకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నేను అక్కడికి వెళ్లిన ప్రతిసారి.. ప్రభాస్ ఎప్పుడు వస్తారు? అని అడిగేవారు. వారి కోరిక ఫలించింది. జపాన్‌లో మా అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు చెబుతున్నా' అని జక్కన్న ఆ లేఖలో రాశాడు.