రూ.3.90 కోట్ల ప్రాపర్టీ టాక్స్ వసూలు
MBNR: జడ్చర్ల పురపాలక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు నిర్దేశించిన రూ.3.90 కోట్ల ప్రాపర్టీ టాక్స్ టార్గెట్‌ను రెవెన్యూ సిబ్బంది సాధించారు. ఈ ఘన విజయానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్స్ అందరూ రెవెన్యూ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. రెవెన్యూ సిబ్బంది కృషితో జడ్చర్ల పురపాలక సంఘం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.