మైనర్‌లు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి: SI
SDPT: యువత ఉజ్వల భవిష్యత్తు కోసం మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ కోరారు. 'అరైవ్-అలైవ్’ భద్రతా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ SI విజయ్ భాస్కర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేసి మాట్లాడారు.