'మహిళా భద్రతకు అనేక చట్టాలు తీసుకువచ్చాం'

KRNL: రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు అనేక చట్టాలు రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళల హక్కులు, రక్షణ, సంక్షేమానికి, మహిళలపై వివిధ రకాల హింస, దారుణాలను నివారించడానికి మహిళా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు.