బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామిరెడ్డికి సన్మానం

నల్గొండ: ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎన్నికైన సాముల రామిరెడ్డిని శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రవి, వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి, సైదులు, వెంకటేశ్వర్లు, రాజా నాయక్, ఓరుగంటి నాగేశ్వరరావు, సంపత్, చందు పాల్గొన్నారు.