NTR: భార్య చివరి కోరికను నెరవేర్చిన భర్త

NTR: రెడ్డిగూడెం మండలం రెడ్డికుంటలో ఏడాది కిందట డెంగ్యూతో చనిపోయిన భార్య వెంకటరమణ కోరికను భర్త రామకృష్ణ నెరవేర్చాడు. భార్య చివరి కోరిక మేరకు రోజుకు 17 గంటలు కష్టపడి చదివి 70.02 మార్కులతో బీసీ-డీ రిజర్వేషన్ కోటాలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రామకృష్ణ సాధించాడు. తన భార్య కోరికను నెరవేర్చడం సంతోషంగా ఉందని, తను ఉండి ఉంటే ఎంతో బాగుండేదని కన్నీరుమున్నీరైనాడు.