చండూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

చండూరులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

NLG: చండూరు పట్టణంలో ఆదివారం మూడు ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఛైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ మల్లేశం నివాళులర్పించారు. 'హ్యాపీ సండే'లో భాగంగా విద్యార్థులతో యోగా చేయించారు. అనంతరం 3వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో పాల్గొన్న చైర్మన్.. ఈ పథకం పేదలకు వరమని కొనియాడారు.