VIDEO: యదేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు యదేచ్చగా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ధనమ్మ మర్రికి వెళ్లే దారిలో వెంకన్న బాబు గుడికి సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలు జరిపి రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్టిని లారీలలో తరలిస్తున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీటిని అదుపు చేయాలని కోరుతున్నారు.