అగ్నికి ఆహుతి అయిన ఆయిల్ ట్యాంకర్

తిరుపతి: గూడూరు రూరల్ ప్రాంతంలో వెంకటగిరి రహదారిపై సోమవారం ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. మండల పరిధిలోని తుంగపాలెం చెమిర్తి రోడ్డు వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్యాంకర్ ఇంజిన్ బాగం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.